telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ హైకోర్టులో చిదంబ‌రానికి మ‌ళ్లీ చుక్కెదురు

congress chidambaram

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరకు మరోసారి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాక‌రించింది. బెయిల్ పై చిదంబరం బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని జ‌స్టిస్ సురేశ్ కెయిట్ ఇవాళ త‌న తీర్పులో తెలిపారు.

ఆగ‌స్టు 21వ తేదీన చిదంబ‌రం అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. తీహార్ జైల్లో చిదంబరం ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే విచార‌ణ జ‌రుపుతున్న కోర్టులో కాకుండా రెగ్యుల‌ర్ బెయిల్ కోసం మాజీ మంత్రి హైకోర్టును ఆశ్ర‌యించారు. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ‌కు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో విదేశీ పెట్టుబ‌డుల‌కు ప‌ర్మిష‌న్లు ఇచ్చిన‌ట్లు చిదంబ‌రంపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.త‌న‌పై ఉన్న ఆరోప‌ణ‌లు తీవ్ర‌మైన‌వి కావు అని చిదంబ‌రం త‌న పిటిష‌న్‌లో తెలిపారు. అక్టోబర్ 3తో ఆయన జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది.

Related posts