telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాఘవేంద్ర రావు ప్రత్యేక చిత్రంలో .. నాగ శౌర్య..!

nagasowrya in ragavendrarao special project

ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఎన్.టి.ఆర్ జయంతి నాడు ఓ సినిమా ఎనౌన్స్ మెంట్ చేసిన విషయం తెలిసిందే. తన ఇన్ని సినిమాల అనుభవంలో ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు రాఘవేంద్ర రావు. ముగ్గురు దర్శకులు.. ముగ్గురు హీరోయిన్స్.. ఒక హీరో కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ముగ్గురు దర్శకుల్లో ఒకరు క్రిష్ అని తెలుస్తుంది.. హీరోయిన్స్ ఇంకా ఫైనల్ అవలేదు. అయితే సినిమాలో హీరోగా నాగ శౌర్య నటిస్తాడని తెలుస్తుంది. యువ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న నాగ శౌర్య రాఘవేంద్ర రావు డైరక్షన్ లో నటించే ఛాన్స్ కొట్టేశాడు.

nagasowrya in ragavendrarao special projectaనాగ శౌర్య తన సొంత బ్యానర్ లో ఓ సినిమా, సమంత అక్కినేని నటిస్తున్న ఓ బేబీలో కూడా నటించాడు. రాఘవేంద్ర రావు డైరక్షన్ లో నాగ శౌర్య అది కూడా ప్రయోగాత్మక సినిమా అనగానే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. సినిమాలో ముగ్గురు దర్శకులు మూడు కథలను నడిపిస్తారట.. అందులో హీరోయిన్స్ ముగ్గురు ఉంటారట. కాని హీరో మాత్రం ఒక్కడే అట. మొత్తానికి నాగ శౌర్యకు ఈ సినిమా కెరియర్ పర్నగా చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఛలో హిట్ తర్వాత రెండు సినిమాలు చేసిన నాగ శౌర్య వాటితో ఫ్లాప్ అందుకున్నాడు.

Related posts