తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆదివారం ఉదయం నరసరావుపేట- చిలకలూరిపేట మార్గంలో వెళుతుండగా పుల్లారావు కారును మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పుల్లారావు కారు స్వల్పంగా దెబ్బతిన్నది. ప్రమాదం నుంచి మాజీ మంత్రి క్షేమంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పత్తిపాటి అభిమానులు, నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
next post
కేంద్ర బలగాలకు అలా చెప్పే హక్కు లేదు: మమతా బెనర్జీ