telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మెన్‌కు రూ.2 వేల జరిమానా

PET certification verification by tspsc from

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్ ఘంటా చక్రపాణి, సెక్రటరీ వాణీ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టు రూ. 2000ల జరిమానా విధించింది.కోర్టు ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగా అమలు చేయనందుకు హైకోర్టు జరిమానాను విధించింది. జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ వాణీ ప్రసాద్ సర్వీస్ రికార్డుల్లో ఈ అంశాన్ని నమోదు చేయాలని కూడ కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

2017 ఏప్రిల్ మాసంలో టీఎస్‌పీఎస్‌సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేష్ ఇచ్చింది. అదే ఏడాది మే మాసంలో రాత పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలు రాసిన వారు కొందరు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు గతంలో కూడా టీఎస్‌పీఎస్ సీ అధికారులకు జరిమాన విధించింది.

Related posts