telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కొత్త రవాణా చట్టం : .. కేంద్రంపై .. రాష్ట్రాల తిరుగుబాటు.. ‘మోడీ అనేనేను’ విఫలమే..

challan with extra insurance premium as traffic rules

కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారులపై కేంద్రప్రభుత్వం పిడుగు వేసినట్టయింది. భారీ జరిమానాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వేలకు వేలు ఫైన్లు వేస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారీ జరిమానాల నుంచి గుజరాత్‌ రాష్ర్ట ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదే బాటలో కర్నాటక కూడా చేరింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా కొత్త మోటార్‌ వాహన చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భారీ చలానాల పేరుతో సామాన్య… మధ్యతరగతి వాహనదారుల జేబులు గుల్ల చేసే ఈ చట్టంపై జనం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొత్త ట్రాఫిక్‌ చలానాలపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన నూతన విధానాన్ని తప్పు పడుతూ వాహనదారులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ జరిమానాల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ప్రభుత్వాలు కూడా ఈ వరుసలో చేరాయి. కేంద్రం ఈ విషయంపై పునరాలోచించకపోతే, తామే జరిమానాలు తగ్గిస్తామని ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న జరిమానాలు ప్రజల మీద పెను భారం పెంచుతున్నాయని అభిప్రాయపడ్డాయి. ఇవేకాకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కేరళ, ఢిల్లీ కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఇప్పటికే ఈ జరిమానాల అంశాన్ని తిప్పి కొట్టింది.

Related posts