telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

కరోనాపై పోరాడుతున్న తల్లులందరికీ ధన్యవాదాలు: సచిన్

Sachin-Tendulkar

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఓ ఆన్ లైన్ కార్యక్యమంలో పాల్గొన్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమ వంతు బాధ్యతలు నిర్వరిస్తున్న తల్లులతో మాట్లాడాడు. ఈ పోరాటంలో భాగమైన తల్లులందరికీ తన ధన్యవాదాలు తెలిపాడు. బాధ్యతల నిమిత్తం తమ పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చిన తల్లులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నాడు.

ఈ సందర్భంగా తన తల్లి గురించి సచిన్ ప్రస్తావించాడు. చిన్నతనం నుంచి తన తల్లితో తన అనుబంధాన్ని మాటల్లో చెప్పలేనని అన్నాడు. క్రికెట్ ఆడతానంటే తనను ఎంతగానో తనతల్లి ప్రోత్సహించిందని గుర్తుచేసుకున్నారు. స్టేడియంలో తాను క్రికెట్ ఆడుతుంటే ఏనాడూ ప్రత్యక్షంగా చూడని తన తల్లి, తన చివరి టెస్టు మ్యాచ్ చూసేందుకు వాంఖడే స్టేడియంకు వచ్చిందని తెలిపారు. మైదానంలోని పెద్ద స్క్రీన్స్ పై తన తల్లి రూపాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యానని అన్నాడు.

Related posts