telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ పై మరోసారి స్పందించిన కేంద్రం..

ప్రభుత్వ రంగంలోని స్టీల్ కంపెనీలకు అవసరమైన ఇనుప ఖనిజం, బొగ్గు సొంత గనుల ద్వారా సమకూరుతుంది. సొంత గనులు లేని సంస్థలు దేశీయ మార్కెట్, లేదా దిగుమతుల ద్వారా సేకరిస్తున్నాయి. సొంత గనులు ఉన్న సంస్థలకు, లేని సంస్థలకు మధ్య ఇనుప ఖనిజం ఖరీదులో వ్యత్యాసానికి అనేక ఇతర కారణాలు చాలా ఉన్నాయి. అని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ అన్నారు. అలాగే స్టీల్ ప్లాంటు ఉన్న ప్రదేశం, గనులున్న ప్రదేశం, ముడిఖనిజం రవాణా వ్యయం, వాటిపై రాష్ట్రాలు విధించే పన్నులు వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపుతాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలని ఒడిశా, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కోరింది. కేంద్ర ఉక్కుశాఖ కూడా ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. “స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా”కు జార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వేర్వేరు ఇనుప ఖనిజం గనులు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బొగ్గు గనులను కేటాయించడం జరిగింది. 2020 మార్చి లో “విశాఖ స్టీల్” ప్లాంటుకు జార్ఖండ్‌లోని రబోడి బొగ్గు గనులు కేటాయిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం ఆమోదించింది. కానీ సొంత ఇనుప ఖనిజం గనులు లేవు అని అన్నారు.

Related posts