telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బెంగాల్‌ ఎన్నికలు : టీఎంసీ ఉపాధ్యక్షుడిగా…?

ప్రస్తుతం మన దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా… అందులో బెంగాల్‌ ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా మారాయి. మమతా సర్కార్‌ ఎలాగైనా కూల్చాలని బీజేపీ పక్క ప్లాన్‌ రెడీ చేస్తోంది. అటు సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గాన్నివదిలిపెట్టి నందీగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నామినేషన్‌ రోజున మమతా బెనర్జీ గాయపడ్డారు. దీంతో ఆమె కాలుకు తీవ్రంగా గాయం అయింది.  అయినప్పటికీ తాను ప్రచారం కొనసాగిస్తానని మమతా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది.   కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాకు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధిష్టానం వైస్‌ ప్రెస్‌డెంట్‌ పదవిని అప్పగించింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన 83 ఏళ్ల యశ్వంత్‌ సిన్హా.. 2018లో బీజేపీకి గుడ్‌ బై చెప్పారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల నేపథ్యంలో గత శనివారం టీఎంసీలో చేరారు. మరోవపు ఆయన కుమారుడు జయంత్‌ సిన్హా మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్నారు. అయితే చూడాలి మరి ఈ తండ్రి, కొడుకుల పార్టీలో ఎవరి పార్టీ విజయం సాధిస్తుంది అనేది.

Related posts