telugu navyamedia
క్రీడలు వార్తలు

పంత్ పై ప్రశంసలు కురిపించిన ఇయాన్‌ ఛాపెల్‌…

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ రెండు నెలల్లో మూడు టెస్టుల పరిస్థితులు మార్చాడని, చాలా మంది తమ జీవిత కాలంలో అలా చేయలేరని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్‌ ఛాపెల్‌ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పంత్‌.. సిడ్నీ టెస్టులో 97, గబ్బా టెస్టులో 89 పరుగులు చేసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌ తో చివరి టెస్టులో సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ కష్టాల్లో ఉన్నప్పుడే పంత్‌ ఆదుకున్నాడు. అయితే ఈ యువ క్రికెటర్‌ తన దూకుడు బ్యాటింగ్‌తోనే కాకుండా కీపింగ్‌లోనూ బాగా మెరుగయ్యాడు. పంత్‌ టీమిండియాలో పేరొందిన ఆటగాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు పరుగులు చేయడానికి ప్రయత్నిస్తే.. ఇంగ్లిష్‌ క్రికెటర్లు వికెట్లు కాపాడుకునేందుకు యత్నించారని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్‌ ఛాపెల్ పేర్కొన్నారు. ఇదే రెండు జట్ల మధ్య ప్రధాన తేడా అని ఆయన చెప్పుకొచ్చారు.

Related posts