telugu navyamedia
క్రీడలు వార్తలు

వైరల్ అవుతున్న మయాంక్ విషెస్…

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అలాగే సంజనా గణేశన్‌ నిన్న గోవాలో సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా బుమ్రా తన పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. దీంతో బీసీసీఐ, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే టీమిండియా టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్..‌ బుమ్రాకు కంగ్రాట్స్‌ చెబుతూ షేర్‌ చేసిన కామెంట్‌ ఇప్పుడు వైరల్ అవుతుంది. బుమ్రాకు శుభాకాంక్షలు తెలిపిన మయాంక్ అగర్వాల్‌ పొరపాటున అతని భార్య సంజనా గణేశన్ ‌కు బదులుగా.. టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్‌ బంగర్‌ పేరును ట్యాగ్‌ చేశాడు. ‘కంగ్రాట్స్‌ జస్ప్రీత్ బుమ్రా.. సంజయ్‌ బంగర్‌! మీ వైవాహిక జీవితం బాగుండాలని, నిత్యం సంతోషంతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు. మయాంక్‌ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ‘అయ్యో మయాంక్.. బుమ్రా భార్య సంజయ్‌ బంగర్‌ కాదు’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే విషయం తెలుసుకున్న మయాంక్..‌ తన ట్వీట్‌ను వెంటనే డిలీట్‌ చేశాడు. అయిన కూడా అభిమానులు అప్పటికే దానిని స్రీన్ షాట్స్ తీయడంతో ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతుంది.

Related posts