telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

AP SSC Results: ఏపీ ఎస్‌ఎస్‌సీ రిజల్ట్స్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32 కాగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 89.17 కావడం విశేషం.

తాజాగా విడుదలైన ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో 96.37 శాతంతో అత్యంధిక శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

అలాగే.. కర్నూలు జిల్లాలో 62.47 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.

టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా ముగిసింది. ఈ ఏడాది రికార్డుస్ధాయిలో కేవ‌లం 22 రోజుల్లోనే ఏపీ ఎస్‌ఎస్‌సీ రిజల్ట్స్‌ (AP SSC Results) 2024 ప్రకటిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది.

ఏపీలో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు జరిగిన విష‌యం తెలిసిందే.

ఈ ఏపీ టెన్త్‌ పరీక్షలకు మొత్తం 6,23,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలుర సంఖ్య 3,17,939..బాలికల సంఖ్య 3,05,153 ఉంది.

అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో AP 10th Class Results 2024 ఫలితాలను ఏప్రిల్ 22వ తేదీ (సోమ‌వారం) ఉద‌యం 11 గంటలకు విడుదల చేశారు.

ఈ ఫ‌లితాల‌ను విజయవాడలో విద్యా శాఖ కమీషనర్ సురేష్‌కుమార్‌ ఫలితాలు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ లేదా “మనబడి వెబ్‌సైట్‌” నుంచి కూడా ఏపీ ఎస్‌ఎస్‌సీ రిజల్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీలో మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో ఈ పదోతరగతి పరీక్షలు నిర్వహించారు.

Related posts