telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ విద్యా వార్తలు

కొద్దిసేపటి క్రితం SSC బోర్డ్ వారిచే విడుదల చేసిన పది ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని.

2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన “ఆకుల వెంటక నాగ సాయి మనస్వి” రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది.

ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ) మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించింది. హిందీ సబ్జెక్ట్‌లో వందకు 99 మార్కులు వచ్చాయి.

ఈ మేరకు మనస్వి ఈ ఏడాది (2024) పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది.

ఏపీలో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు జరిగిన విష‌యం తెలిసిందే.

ఈ ఏపీ టెన్త్‌ పరీక్షలకు మొత్తం 6,23,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలుర సంఖ్య 3,17,939..బాలికల సంఖ్య 3,05,153 ఉంది.

ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32 కాగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 89.17 కావడం విశేషం.

Related posts