telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గ్యాస్ లీకేజీ ఘటన పై ఈ రోజు మంత్రుల బృందం భేటీ

minister kannababu

విశాఖ నగరంలో నిన్న రాత్రి గ్యాస్ లీకేజీ ఘటన పై ఈ రోజు మంత్రుల బృందం భేటీ కానున్నారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి మరోసారి గ్యాస్ లీకవుతున్నట్లు సమాచారం రావడంతో స్థానికులు రోడ్లపైకి వచ్చి సురక్షిత ప్రాంతాలవైపు పరుగులు తీశారు. ఈ విషయంపై ఏపీ మంత్రులు స్పందించి స్పష్టతనిచ్చారు.నిన్న రాత్రి బ్లాస్టింగ్‌ జరిగిందని కొందరు సోషల్‌ మీడియాలో వదంతులు సృష్టించారని అన్నారు. అలాంటి పరిస్థితులేమి లేవని ఏపీ మంత్రి కన్నబాబు వివరించారు.

నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పనిచేస్తున్నారన్నారు. ఇవాళ మంత్రుల బృందం భేటీ లో మూడు అంశాలపై చర్చించబోతుందని తెలిపారు. సీఎం జగన్‌ గారి ఆదేశాల మేరకు పరిశ్రమల్లో భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం. ప్రజలు పూర్తిగా భద్రతలో ఉన్నామన్న భావన కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related posts