టెక్ దిగ్గజం యాపిల్ సాఫ్ట్ వేర్ లో ఉన్న ఓ లోపాన్ని ఢిల్లీ టెక్కీ కనిపెట్టాడు. యాపిల్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యే ఆప్షన్ ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఐడీ లేకుండానే లాగిన్ అయ్యే లోపం అందులో ఉందని కనిపెట్టిన భావుక్ జైన్ అనే యువకుడు, దాన్ని యాపిల్ కు తెలిపాడు. ఆ వెంటనే ఆ లోపాన్ని యాపిల్ సరిచేసుకుంది.
సాఫ్ట్ వేర్ లో లోపాన్ని కనిపెట్టినందుకు అతనికి లక్ష డాలర్ల బహుమతిని అందిస్తామని తెలిపింది. కాగా, భావుక్ జైన్ ఇలా సాఫ్ట్ వేర్లలో లోపాలను పసిగట్టడం ఇదే తొలిసారేమీ కాదు. గతంలో యాహూ, ఫేస్ బుక్, గ్రాబ్, గూగుల్ తదితరాల్లోనూ బగ్స్ కనిపెట్టి భారీ ప్రైజ్ మనీలను పొందాడు.
ఆంధ్ర ప్రదేశ్ అంటే అడవాళ్ల ప్రదేశ్ గా మారాలి: రోజా