telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్ణాటకీయం : .. సంకీర్ణం స్పందన… పదవులు శాశ్వతం కాదట…

కర్ణాటక అసెంబ్లీలో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ జండా ఎగరవేసింది. విశ్వాసపరీక్షలో ఓడిపోవడంతో అధికారపీఠంపై కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కథ ముగిసింది. సీఎం కుమారస్వామి తన రాజీనామా లేఖను స్వయంగా గవర్నర్ వాజూభాయ్ వాలాకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కర్ణాటక ప్రజలు తనను క్షమించాలని కోరారు. పూర్తికాలం కొనసాగడంలో విఫలమయ్యానని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయానని విచారం వ్యక్తం చేశారు.

ప్రజలకు చేయగలిగినంత మేలు చేశానని, రైతులకు రుణమాఫీ చేశానని వివరించారు. ఏడాదిగా క్షుద్రరాజకీయానికి బలవుతూ వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పదవి శాశ్వతం కాదని, బీజేపీ ధోరణి చాలా బాధ కలిగించిందని చెప్పారు. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. చెడు సాధించిన విజయం తాత్కాలికమేనని, అంతిమంగా సత్యం, ప్రజాస్వామ్యమే గెలుస్తుందని పేర్కొంది. ప్రజా తీర్పును అపహాస్యంపాలు చేసేలా ఉన్న అవినీతి విధానాలను కూకటివేళ్లతో సహా పెకిలించి వేసేందుకు తాము కట్టుబడిఉన్నామని, ఇన్నాళ్లూ ప్రజలు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపింది.

Related posts