అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరుకావాలని ఏపీ సీఎం జగన్ ను సీబీఐ కోర్టు నిన్న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మనీలాండరింగ్ కేసు నుంచి జగన్ తప్పించుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. మొత్తం 11 ఛార్జిషీట్లలో ట్రయల్ మొదలైతే… జగన్ దృష్టంతా కోర్టు బోనుపైనే ఉంటుందని అన్నారు.
బోనులో ఉంటే జనాలు అసహ్యించుకుంటారని, అందుకే ప్రజల దృష్టిని మరల్చడానికి రాష్ట్రంలో గందరగోళానికి తెర లేపారని విమర్శించారు.అధికారం ఉందని ఇష్టానుసారం చేయడం సరికాదని యనమల అన్నారు. తొలుత ఆర్డినరీ రూపంలో వచ్చిన వికేంద్రీకరణ బిల్లు ఆ తర్వాత మనీ బిల్లుగా వచ్చిందని చెప్పారు. ఎస్సీ కమిషన్, ఆంగ్ల మాధ్యమం బిల్లులు మండలికి ఆర్డినరీ బిల్లులుగా వచ్చాయని తెలిపారు.
సీఎం జగన్ కు దెయ్యం పట్టింది: పంచుమర్తి అనురాధ