telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

భైంసా మున్సిపాలిటీలో కారుకు బ్రేక్

another congress mla into trs

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో దూసుకుపోయిన కారుకు భైంసా మున్సిపాలిటీలో మాత్రం బ్రేక్ పడింది. కాంగ్రెస్ కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈ రెండు పార్టీలు కనీసం ఒక్క వార్డును సైతం దక్కించుకోలేకపోయాయి. నిర్మల్ జిల్లాకు చెందిన భైంసా మున్సిపల్ ఎన్నిల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీచేసినప్పటికీ ప్రధాన పోటీ ఎంఐఎం, బీజేపీ మధ్యే జరిగింది.

ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలను మెప్పించాడానికి ఎంఐఎం, బీజేపీలు ప్రచారం సందర్భంగా తీవ్రంగా కృషిచేశాయి. భైంసాలో మొత్తం 26 వార్డులుండగా అందులో ఎంఐఎంకు 15 స్థానాలు దక్కగా, బీజేపీ 9 వార్డుల్లో గెలుపొందింది. కాగా స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు విజయం సాధించారు.

Related posts