telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పవన్ తో పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్..?

పూరి జగన్నాథ్ ఇప్పటికి ఎందరితోనే మంచి మంచి సినిమాలను తెరకెక్కించాడు. కానీ పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను మాత్రం చేయడానికి సరైన హీరో దొరక్క సతమతమవుతున్నాడు. ఈ సినిమా మళ్లీ చాలా కాలం తరువాత వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం రాజకీయాల నేపథ్యంలో దేశభక్తి ప్రధానాంశంగా సాగనుందట. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా లైన్ విన్న పవన్ పూర్తి స్క్రప్ట్ కోరాడట. దాంతో పవన్ ఈ సినిమా దాదాపుగా ఖరారు చేసినట్లే అని అంటున్నారు. వీరిద్దరి కాంబోలో ఇదివరకు బద్రి, కెమెరామాన్ గంగతో రాంబాబు వంటి వవర్ ఫుల్ సినిమాలు వచ్చాయి. అయితే పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను ముందుగా సూపర్ స్టార్ మహేష్ చేయాలని అనుకున్నాడట. కానీ బిజినెస్ మాన్ సినిమా తరువాత మహేష్ పూరీతో చేయడానికి ఆసక్తి చూపలేదట, దాంతో పూరీ ఈ ప్రాజెక్ట్ కోసం వేరే హీరోను వెతకడం మొదలుపెట్టాడు. తాజాగా ఈ సినిమాకు పవన్‌ను సంప్రదించాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అతి త్వరలో దీనిపై క్లారిటీ వచ్చేందుకు అవకాశాలు బాగానే ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts