telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“అత్తారింటికి దారేది” సీన్ తో జగన్ పై లోకేశ్ విమర్శలు

Minister Lokesh comments YS Jagan

పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది తెలుగు చలన చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.

ఈ సినిమాలో బ్రహ్మానందం అబద్ధాలు ఆడుతుండగా ఓ చెట్టు ఆకులు రాలిపోయే సీన్ అద్భుతంగా ఉంది. ఇప్పుడదే సీన్ నును జగన్ ను విమర్శించడానికి ఉపయోగించుకున్నారు. సీఎం జగన్ ఇచ్చిన అబద్ధపు హామీలకు ఆకులు రాలడం ఏంటి, ఏకంగా చెట్లే పడిపోతాయి అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పోస్టు చేసిన వీడియోలో, ఓవైపు జగన్ హామీలు గుప్పిస్తుండగా, మరోవైపు చెట్టు ఆకులు రాలిపోతుంటాయి.

Related posts