telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఢిల్లీ : ఆరు అయిందో లేదో.. ఆవురావురు మన్న మందు బాబులు..

people rush for alcohol in delhi at 6pm

రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఇలా పోలింగ్ ముగిసిందో, లేదో.. వైన్‌షాపులు కిక్కిరిసిపోయాయి. రెండు రోజులుగా మద్యం దొరక్కపోవడంతో నాలుక పిడచకట్టుకుపోయిన మందుబాబులు ఆగలేకపోయారు. షాపులు తెరిచీ తెరవగానే వాటిపై పడ్డారు. వారి దెబ్బకు షాపులు వద్ద జాతర వాతావరణం కనిపించింది. చాలా దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఇదే వాతావరణం కనిపించింది. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.

ప్రచారం ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం ఎన్నికల సంఘం ఆదేశాలతో మద్యం షాపులను మూసివేశారు. దీని తో రెండు రోజులపాటు దుకాణాలు మూతపడ్డాయి. మరోవైపు విషయాన్ని ముందే గ్రహించిన మందుబాబులు శుక్రవారమే పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకున్నారు. శనివారం షాపులు పూర్తిగా మూతపడ్డాయి. తిరిగి ఆదివారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఆరు గంటల ప్రాంతంలో దుకాణాలు తిరిగి తెరుచుకున్నాయి. దాదాపు 36 గంటలపాటు మద్యం లేక నానా అవస్థలు పడిన మద్యం ప్రియుళ్లు ఆదివారం షాపులు తెరిచీ తెరవగానే వాటిపై పడ్డారు. దీంతో దుకాణాల వద్ద కోలాహలం నెలకొంది. చాలా షాపుల ఎదుట ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి.

Related posts