telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రొయ్యల రైతులకు .. ఏపీ ప్రభుత్వ వరాలు..

ap govt cut unit rate more for aqua formers

ఆక్వా రైతులను ఆదుకొనేందుకు జగన్‌ సర్కార్‌ సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న యూనిట్‌ విద్యుత్‌ చార్జీని రూ.1.50కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీఓఆర్‌టీ నంబర్‌ 70 విడుదల చేసింది. దీనివల్ల రొయ్యల చెరువులు సాగు చేస్తున్న రైతుల విద్యుత్‌ చార్జీలు మరింత తగ్గనున్నాయి. జిల్లా పరిధిలో వేటపాలెం, కొత్తపట్నం, ఒంగోలు రూరల్, సింగరాయకొండ, టంగుటూరు, చినగంజాం, చీరాల, ఉలవపాడు, గుడ్లూరు, నాగులుప్పలపాడు, జరుగుమల్లి మండలాల్లో 28 వేల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు. వీటి పరిధిలో 2,530 కేటగిరి-3 విద్యుత్‌ సర్వీసులున్నాయి.

గత ప్రభుత్వం రొయ్యల చెరువుల విద్యుత్‌ చార్జీలు యూనిట్‌కు రూ.3.86 చొప్పన నాలుగేళ్లపాటు వసూలు చేసింది. ఎన్నికలకు ముందుకు వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి హామీతో, యూనిట్‌ చార్జి రూ.2కు తగ్గించింది. దీనివల్ల ఒక పంట కాలానికి రూ.60 వేలు విద్యుత్‌ చార్జి కట్టాల్సి వస్తోంది. జగన్‌ సర్కార్‌ యూనిట్‌కు మరో 50 పైసలు తగ్గించడం వల్ల ఒక్కో ఎకరాకు నాలుగు నెలల పంట కాలానికి విద్యుత్‌ చార్జి రూ.45 వేలకు తగ్గుతోంది. దీనివల్ల ఒక పంట కాలానికి రూ.15 వేలు తగ్గనున్నాయి. ఈ లెక్కన జిల్లాలో 28 వేల ఎకరాలలో ఉన్న రొయ్యల చెరువుల సాగుకు ఒక పంటకు రూ.42 కోట్ల విద్యుత్‌ చార్జీలు తగ్గనున్నాయి. ఈ లెక్కన రొయ్య రైతులకు ఒక పంటకు రూ.42 కోట్లు మిగిలినట్లే లెక్క. దీంతో రొయ్య రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం : 28,000 ఎకరాలు
వీటి పరిధిలో కేటగిరి-3 విద్యుత్‌ సర్వీసులు సంఖ్య: 2,530
చార్జీల తగ్గింపుతో ఒక పంట కాలానికి తగ్గనున్న భారం : రూ.42 కోట్లు.

Related posts