ఆస్ట్రేలియాలోని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కమ్యూనిటి హోమ్ టౌన్ రిటైర్మెంట్ విలేజ్.. జాతీయ పార్కు పక్కనే ఉంది. తాజాగా జాతీయ పార్కులోంచి ఆ విలేజ్‌లోకి వచ్చిన కొండచిలువ.. ఓ పెద్ద బల్లిని మింగుతూ అక్కడి వారికి కనిపించింది. కొండచిలువ ఇంటి పైభాగం నుంచి తలకిందులుగా వేలాడుతూ ఓ భారీ బల్లిని మింగుతున్న దృశ్యాన్ని చూసిన ఆ ఇంటి యజమాని.. ఆ దృశ్యాలను ఫొటో తీసి నెట్‌లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.