టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. “పరాజయంపాలై రెండేళ్లు గడిచినా బాబులో ఇప్పటికీ పరివర్తన రాలేదు. ఎందుకు ఓడానో తెలియదని, తనను అర్థం చేసుకొనే శక్తిలేకే ఓడించారని ప్రజలను నిందిస్తున్నాడు. ఎగ్జామ్ బాగా రాసినా పేపర్లు దిద్దిన టీచర్ కావాలనే తనను ఫెయిల్ చేశాడని విద్యార్థి ఏడ్చినట్టుంది బాబు వ్యవహారం.” అంటూ చురకలు అంటించారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో “రెండేళ్లలో జగన్ గారు ఏం చేయక పోతే 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పచ్చపార్టీ అడ్రసు లేకుండా ఎందుకు పోతుంది? పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది. వచ్చే మూడేళ్లలో యువ సిఎం నాయకత్వంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి.” అంటూ పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.
previous post