విశాఖ డాక్టర్ సుధాకర్ కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. సుధాకర్ పట్ల దాడికి పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేసి విచారించాలని సీబీఐని ఆదేశించింది.ఈ నేపథ్యంలో సీబీఐ ఈరోజు రంగంలోకి దిగింది. సుధాకర్ ను ఉంచిన మానసిక చికిత్సాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు దాదాపు ఐదు గంటలసేపు ఆయన నుంచి పూర్తి వివరాలను తీసుకున్నారు.
ఆసుపత్రిలో మాస్కులు ఇవ్వలేదంటూ గొడవ చేసిన రోజు నుంచి జరిగిన అన్ని పరిణామాలపై సమాచారాన్ని సేకరించారు.మరోవైపు హైకోర్టు ఆదేశాలతో కేసును విచారించిన సీబీఐ ఐపీసీ 120బి, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.
చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ: శివరాజ్‌సింగ్