మూసిన కన్నులలో…
వేధించే కష్టాలు కాన రాలేదు
కటిక చీకట్లు కాన రాలేదు
దుఃఖ సాగరాలు కాన రాలేదు
నీ సుందర రూపం తప్ప
వేచిన గుండెలో
పనుల ఒత్తిడి లేదు
కష్టాల ఊసు లేదు
నీ ప్రేమ దీపం తప్ప!
అలసిన మనసులో
రణ గొణ ధ్వనులు లేవు
పక్షుల కిలకిల రావాలు లేవు
సాగరపు అలల సవ్వళ్లు లేవు
నీ ఊసుల జడి వాన తప్ప!