మండ్య లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ హీరోయిన్ సుమలతకు స్టార్ హీరోలు యష్, దర్శన్ లు మద్దతుగా నిలిచారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు స్టార్ హీరోలకు బెదిరింపులు మొదలయ్యాయి. ఇదే స్థానం నుంచి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేస్తున్నందున ఈ సీటుకు ప్రాధాన్యత ఏర్పడింది. సుమలత మీడియా ముందుకొచ్చి పోటీ విషయం ప్రకటించినప్పుడు, తాజాగా నామినేషన్ వేసిన సమయంలోనూ ఇరువురు స్టార్ హీరోలు దర్శన్, యశ్‌లు ఆమె వెంటే ఉండడంతో జేడీఎస్ నేతలకు గుండెల్లో గుబులు మొదలైంది.
కె.ఆర్.పేటకు చెందిన జేడీఎస్ ఎమ్మెల్యే నారాయణగౌడ సినీ హీరోలు తమ వైఖరిని ఇలాగే కొనసాగిస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని, నటుల అక్రమాల జాతకాలను వెలికితీయాల్సి ఉంటుందని, కన్నడ నటులు గౌరవంగా వారి ఇళ్ళల్లో ఉండాలని, ప్రచారం పేరిట జేడీఎస్, నాయకులను విమర్శిస్తే బాగుండదని హెచ్చరించారు. రాజకీయాలకు ఆ హీరోలు దర్శన్, యశ్‌లకు ఏం సంబంధమని ప్రశ్నిస్తూ ఇరువురి హీరోలపైనా తీవ్రంగా స్పందించారు. కాగా ‘నమ్మ కర్ణాటక రక్షణా వేదిక’ అధ్యక్షుడు జయరాజ్ నాయుడు బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇరువురు స్టార్ హీరోలు దర్శన్, యశ్‌లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని వారి సినిమాలను ‘కోడ్’ ఉల్లంఘనగా భావించి నిలిపివేయాలని వినతిలో పేర్కొన్నారు.
శంకర్ గ్రాఫిక్స్ డైరెక్టర్ మాత్రమే : వడివేలు