telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మొదటి కారు కొన్నప్పటి కంటే ఎక్కువ ఆనందం కలిగింది : సోనూసూద్

Sonu-Sood

కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా బీహార్ చంపారన్ లోని భోలా గ్రామానికి చెందిన ఒక కుటుంబం అక్కడ వచ్చిన వరదల్లో తమ కుమారుడిని అలాగే కుటుంబానికి ఆదాయం ఇచ్చే గేదెను కోల్పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూసూద్ దానిపై స్పందించారు. వెంటనే వారికి ఒక గేదెను కొనిచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ”ఈ కొత్త గేదెను కొంటున్నపుడు నేను మొదటి కారు కొన్నపుడు కంటే ఎక్కువ ఆనందం కలిగింది. నేను అక్కడికి వచ్చినప్పుడు తప్పకుండ ఒక గ్లాసు గేదె పాలు తాగుతాను అని” ట్వీట్ చేశాడు.

కాగా లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. ఇక ఇటీవలే చిత్తూరు జిల్లాకు చెందిన పేద రైతుకు ట్రాక్టర్ కొనిచ్చారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటోన్న వరంగల్ యువతి శారదకు ఉద్యోగం ఇప్పించారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దీంతో సోనూసూద్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తిరిగి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఆయన ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్కడితో ఆగకుండా లాక్ డౌన్ తరవాత కూడా ఆయన సేవలను కొనసాగిస్తున్నారు.

Related posts