telugu navyamedia
సినిమా వార్తలు

పెళ్ళి చేసుకోకపోవడానికి కారణమేంటో చెప్పేసిన సల్మాన్

Salman-Khan

బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో “దబాంగ్-3” చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం చిత్రీకరణ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ “భారత్” సినిమా షెడ్యూల్‌తో సల్మాన్ బిజీ అవ్వడంతో “దబాంగ్-3” షూటింగ్‌కు బ్రేక్ పడింది. తాజాగా “దబాంగ్-3” చిత్రం మళ్లీ సెట్స్ పైకి వెళ్ళింది. చివ‌రిగా భార‌త్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స‌ల్మాన్ ఇప్పుడు “దబాంగ్-3″తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ కు భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. సల్మాన్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ప‌లువురు హీరోయిన్స్‌తో ప్రేమాయ‌ణాలు సాగించిన బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఇప్ప‌టివ‌ర‌కు బ్యాచిల‌ర్‌గానే ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన వయసు 53 సంవత్సరాలు. దేశంలోని మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్‌గా పేరు సంపాదించుకున్నాడు. తాను ఇప్ప‌టివ‌ర‌కు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని స‌ల్మాన్ ఇటీవ‌ల వెల్ల‌డించాడు. ఇప్ప‌టిర‌కు త‌న‌ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోమ‌ని అడ‌గ‌లేద‌ని, అందుకే తాను వివాహానికి దూరంగా ఉండిపోయాన‌ని స‌ల్మాన్ తాజాగా వెల్ల‌డించాడు. “నా నిజ జీవితంలో ఏ అమ్మాయి నా ద‌గ్గ‌ర పెళ్లి ప్ర‌పోజ‌ల్ తీసుకు రాలేదు. నేనెప్పుడూ క్యాండిల్ లైట్ డిన్న‌ర్స్ చేయ‌లేదు. క్యాండిల్ లైట్‌లో ఏమి పెడుతున్నారో కూడా చూడ‌కుండా తిన‌లేను. అయితే నన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోమని అడగనందుకు బాధగా ఉంది” అని స‌ల్మాన్ అన్నాడు.

Related posts