telugu navyamedia
సినిమా వార్తలు

పూనమ్ ఫోన్ కాల్… పవన్ గురించి వ్యాఖ్యలు… వదలనంటున్న శ్రీరెడ్డి…!?

Srireddy-and-Pawan-Kalyan

శ్రీరెడ్డి ఈమధ్య తమిళంలో సినిమా ఆఫర్లు రావడంతో చెన్నైకి వెళ్ళిపోయిన శ్రీరెడ్డి కొన్నిరోజులు సంచలనాలకు దూరంగా ఉంది. ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలను మొదలు పెట్టేసింది. కొరటాల శివ, దగ్గుబాటి ఫ్యామిలీని, నానిని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఇప్పటివరకు ఫేస్ బుక్ ద్వారా వివాదాస్పద అంశాలకు అడ్రస్ గా మారిన శ్రీరెడ్డి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ను కూడా స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించే శ్రీరెడ్డికి ఇప్పుడు మరో ఆయుధం దొరికింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి పూనమ్ కౌర్ ఫోన్ కాల్ అంటూ ఓ ఆడియో టేప్ వైరల్ అవుతోంది.

ఇందులో పవన్ గురించి పూనమ్ ఎమోషనల్ గా మాట్లాడింది. పవన్ కోసం ఎన్నో త్యాగాలు చేశానని, పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయానని, కానీ అతడు తనకు అన్యాయం చేశాడని పూనమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈ వాయిస్ పూనమ్ దేనా లేక మరెవరైనా పవన్ పై బురద చల్లడానికి కుట్ర చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఆడియో టేప్ లో వినిపిస్తోన్న వాయిస్ పూనమ్ దేనని, పూనమ్ మాటలు విని ఏడ్చేశానని, పవన్ కళ్యాణ్ అస్సలు విడిచిపెట్టనని శ్రీరెడ్డి చెబుతోంది. మరోవైపు జనసైనికులు తెలుగు రాని పూనమ్ ఇంత స్పష్టంగా తెలుగులో ఎలా మాట్లాడుతుంది ? ఇది పూనమ్ వాయిస్ కాదు… కావాలనే ఎవరో పవన్ పై కుట్ర చేస్తున్నారు.. అంటూ మండిపడుతున్నారు.


Related posts