భారత్ – పాక్ సరిహద్దున యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు దేశమంతా వింగ్ కమాండర్ అభినందన్ పేరే మార్మోగిపోతోంది. ఇంకాసేపట్లో పాక్ అధికారులు అభినందన్ ను భారత్ కు అప్పగించనున్నారు. అయితే ఈ సమయంలో పలువురు సినిమా స్టార్స్ సినిమాల ప్రమోషన్స్ తో బిజీగా ఉండడంతో నెటిజన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ సమయంలో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంటే… మీరు మాత్రం సినిమా ప్రచారాలను చేస్తారా ? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల హీరో అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో “కేసరి” సినిమాకు సంబంధించిన ప్రచారాలను ముమ్మరం చేశాడు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ సినిమా గురించి ప్రచారం చేస్తుండడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దేశం కోసం సినిమా కార్యక్రమాలను కొన్ని రోజులు వాయిదా వేసుకోలేరా ? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ సైలెంట్ అయ్యిందనే చెప్పొచ్చు. ఇక అక్షయ్ కుమార్ పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవానులు కుటుంబాలకు 5 కోట్ల విరాళాన్ని అందించిన సంగతి తెలిసిందే. కేసరి సినిమా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
previous post