telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాక రేపుతున్న జబర్ధస్త్ యాంకర్

ప్రముఖ హాట్ యాంకర్ రష్మీ బుల్లితెరపై సత్తా చాటుతోంది. తెలుగు అంత స్పష్టంగా మాట్లాడకపోయినప్పటికీ.. తన ముద్దు ముద్దు చేష్టలతో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది రష్మి. కెరీర్ ప్రారంభంలో డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ ఈ యాంకర్.. ఇప్పుడు వరుస షోలతో బాగానే సంపాదిస్తోంది.  ఈ మధ్య రష్మీ నటించిన గుంటూరు టాకీస్‌ కేవలం రష్మీపేరు.. తన అందచందాలతోనే హిట్‌ అయిందని చెబుతారు ఆమె ఫ్యాన్స్‌. అది అలా ఉండే రష్మీ వీలున్నప్పుడల్లా.. ఫోటోషూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతిపోయేలా చేస్తోంది. అయితే.. తాజాగా చీరకట్టుతో ఉన్న ఫోటోలను రష్మీ షేర్‌ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో రష్మీ అందానికే అందంలా కనిపిస్తోంది. కాగా.. రష్మీ నటించిన బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటుండగా.. త్వరలోనే రిలీజ్‌ కానుంది. 

Related posts