telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

సోషల్ మీడియాలోకి రానున్న చిరంజీవి..స్వాగతం పలుకుతూ నాగబాబు ట్వీట్!

Nagababu chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. తను సోషల్ మీడియలోకి అడుగు పెడుతున్న విషయం గురించి తెలుపుతూ స్వయంగా ఓ వీడియోను చిరంజీవి విడుదల చేశారు. నా అభిమానులతోటి షేర్ చేసుకోవడానికి, అలాగే నేను అనుకున్న మెసేజ్ కానీ, చెప్పాలనుకున్నవి ప్రజలతోటి చెప్పుకోవడానికి అది వేదికగా భావిస్తూ.. నేను ఇకపై సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతాను. అది ఈ ఉగాది రోజు నుంచి..’’ అని మెగాస్టార్ చిరంజీవి ఈ వీడియోలో తెలిపారు.

చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ పై సోదరుడు, నటుడు నాగబాబు స్పందించారు. సోషల్ మీడియాలోకి వస్తున్నట్టు అన్నయ్య ప్రకటించడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకోనున్న ఆయన, ప్రజలపై కచ్చితంగా పాజిటివ్ ప్రభావం చూపనున్నారని అన్నారు. సోషల్ మీడియాలోకి తన అన్నయ్యను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానంటూ ఓ ట్వీట్ చేశారు.

Related posts