లాక్ డౌన్ నేపథ్యంలో ఆటోడ్రైవర్లకు ఢిల్లీ సర్కార్ శుభవార్త చెప్పింది. రాజధాని ఢిల్లీలో ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల అకౌంట్లలోకి 5వేలు ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఆటో, ట్యాక్సీ, ఈ-రిక్షా, ఆర్టీవీ, గ్రామీణ సేవా డ్రైవర్ల ఖాతాల్లో నేరుగా 5వేల నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తామని సీఎం తెలిపారు.
వారం లేదా 10 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఢిల్లీలో ఇప్పటి వరకు 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మృతిచెందారు.
మండలికి ఎవరు తాగొచ్చారు.. యనమల వ్యాఖ్యలపై బొత్స ఫైర్