telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఈ రోజు విడుదల అయినా తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 470 కి 468 మార్కులు!

ఈరోజు బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదలయ్యాయి.

మరోసారి, ఫలితాలలో అమ్మాయిలు విజయ భేరిమోగించారు. స్టేట్‌ టాపర్‌గా కూడా విద్యార్థినియే రావడం విశేషం.

తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో కామారెడ్డి జిల్లా అంతంపల్లికి చెందిన చర్విత టాపర్‌గా నిలిచింది.

ఈ అపూర్వ విద్యార్థి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ ఘనత అపూర్వమైనదని పేర్కొన్నారు. ఎంపీసీ గ్రూప్‌లో చదివిన చర్విత పరీక్షల్లో 468 మార్కులు సాధించింది.

ఆమె సబ్జెక్టుల వారీగా స్కోర్లు ఇలా ఉన్నాయి: ఇంగ్లిష్ – 99, సంస్కృతం – 99, మ్యాథ్స్ 1ఎ – 75, మ్యాథ్స్ 1బి – 75, ఫిజిక్స్ – 60, కెమిస్ట్రీ – 60. చర్విత తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంటున్నది.

ఇటీవల ప్రకటించిన AP 10వ ఫలితాల్లో మనస్వి 600కి 599 స్కోరు సాధించి సరికొత్త ఆల్ టైమ్ రికార్డును క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ద్వితీయ భాషలో ఒక్క మార్కు తగ్గింపు మాత్రమే ఉంది.

తాజాగా చర్వితకు కూడా కేవంల్‌ లాంగ్వేజ్‌లల్లో మాత్రమే 1,1 చొప్పున రెండు మార్కులు తగ్గాయి.

అయినప్పటికీ, ఆమె తన అత్యుత్తమ ప్రదర్శనతో చరిత్ర సృష్టించి, అన్ని ఇతర అంశాలలో రాణించగలిగింది.

ఇక నేడు విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో.. ఫస్టియర్‌లో 2,87,261 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత 60.01 శాతంగా నమోదయ్యింది.

సెకండియర్‌లో 3,22,432 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 64.19శాతంగా పేర్కొన్నారు.

ఇక ఎప్పటి లానే ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికల హవానే కొనసాగిందే. వారే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతంలో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.

సాయంత్రం 5 గంటల నుండి మెమోలు అందుబాటులో ఉంచనున్నారు.

రేపటి నుండి అనగా ఏప్రిల్‌ 25 నుంచి మే నెల 2 వరకు రీ వెరిఫికేషన్, రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

వచ్చే నెల అనగా మే 24 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు.

Related posts