రాజధాని అమరావతి ఉద్యమం నేటికీ 310 రోజులు పూర్తిచేసుకుంది. రాజధాని గ్రామాల రైతులు,మహిళల నిరసనలు ఇంకా కొనసాగుతున్న ఉన్నాయి. అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికీ ఐదేళ్లు పూర్తయింది. ఐదేళ్ల క్రితం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి కి ప్రధాని మోడి శంకుస్థాపన చేసారు. శంకుస్థాపనకు గుర్తుగా నేడు రాజధాని రైతులు, మహిళల వినూత్న నిరసనలు చేపట్టారు. అమరావతి-నాటి వైభవం-నేటి దుస్థితి పేరుతో శంకుస్థాపన ప్రాంతం వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు నిరసన తెలపనున్నారు. ఉదయం 9 గంటలకు రాయపూడి, మందడం నుంచి పాదయాత్ర గా శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి చేరుకోనున్నారు రాజధాని గ్రామాల రైతులు, మహిళలు. ఉదయం 10.30 గంటలకు ఉద్దండరాయునిపాలెంలో సర్వమత ప్రార్థనలు చేస్తారు. అమరావతి చూపు-మోడి వైపు పేరుతో వినూత్న ప్రదర్శన చేయనున్నారు. రాత్రి కి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాల ప్రదర్శన చేపట్టనున్నారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం కొనసాగుతుంధి.
previous post
గ్రామ వలంటీర్లను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు: ఎమ్మెల్యే రజని