భారత్ దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని..ఆటకు కొంత విరామం ఇచ్చి..దేశ సేవకు సిద్ధమయ్యారు. కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టనున్నారు. పెట్రోలింగ్, గార్డు, 15 రోజుల పాటు పోస్ట్ డ్యూటీ నిర్వర్తించున్నట్లు భారత ఆర్మీ గురువారం వెల్లడించింది. వెస్టిండీస్ సిరిస్ నుండి తానంతట తానే టీమ్ నుండి వైదొలిగిన మిస్టర్ కూల్.. ‘ జులై 31 నుండి ఆగష్టు 15 వరకు 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్(పారా)లో సైనికులతో కలిసి లెఫ్టినెంట్ కల్నల్ ధోని విధులు నిర్వహిస్తారని’ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. కాశ్మీర్ వ్యాలీలోని విక్టర్ ఫోర్స్‌లో విధులు నిర్వహించునున్నట్లు పేర్కొంది.
2011లో అభినవ్ బింద్రా, దీపక్ రావ్‌లతో పాటు ధోనికి గౌరవ లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాను ఆర్మీ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. పారాచూట్ రెజిమెంట్(106 పారా టిఎ బెటాలియన్)కు చెందిన ఆయన 2015లో ఆగ్రాలో శిక్షణా కేంద్రంలో విమానంలో నుండి పారాచూట్ ద్వారా దూకేలా ఐదు విభాగాల్లో శిక్షణ పూర్తి చేశారు.
కావాలనే కొందరు సూర్యను టార్గెట్ చేస్తున్నారు… భారతీరాజా షాకింగ్ కామెంట్స్