telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియాకు మరో ముప్పు : వణికిస్తున్న వైట్ ఫంగస్

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజు రోజుకు ఈ బ్లాక్ ఫంగల్ కేసులు పెరిగిపోతున్నాయి. ఫస్ట్ వేవ్ నుంచి కొలుకున్నవారిలో ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తోంది.  ఈ తరుణంలో మరో వ్యాధి ఇండియాను టెన్షన్ పెడుతోంది. తాజాగా పాట్నాలో వైట్ ఫంగస్ రోగులను వైద్యులు గుర్తించారు. ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రాణాంతకమని నిపుణులు భావిస్తున్నారు. పాట్నాకు చెందిన నలుగురు వ్యక్తులు కొద్దిరోజుల కిందట వైట్ ఫంగస్ బారిన పడినట్లు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల సంక్రమనకు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) ప్రధాన కారణమని చెబుతున్నారు. ఊపిరితిత్తులతో పాటు చర్మం , గోర్లు, నోటి లోపల భాగం, కడుపు మరియు పేగు, మూత్రపిండాలు, జననేంద్రియాలు, మెదడు మొదలైన వాటికి కూడా ఇది సోకుతుందని వెల్లడించారు.

Related posts