telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

జూన్ మొదటివారంలో ఎంసెట్‌ ఫలితాలు!

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు జూన్ మొదటివారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్‌లో ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్‌ ఫలితాలను ప్రకటించిన తర్వాత ఎంసెట్‌ ఫలితాలను వెల్లడించాలని ఎంసెట్‌ కమిటీ భావిస్తోంది. రీవెరిఫికేషన్‌ ఫలితాల అనంతరం ఇంటర్మీడియట్‌ మార్కులకు ఎంసెట్‌ ర్యాంకులో 25 శాతం వెయిటేజీని ఇచ్చి తుది ర్యాంకులను ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ నెలాఖరులోగా ఇంటర్‌ బోర్డు ఆ ఫలితాలను వెల్లడిస్తే వచ్చే నెల మొదటి వారంలో ఎంసెట్‌ ఫలితాలు వెలువడనున్నాయి. ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు ఆలస్యమైతే ఎంసెట్‌ ఫలితాల విడుదల కూడా ఆలస్యం అయ్యే అవకాశముంది.

Related posts