telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

సరికొత్త ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన వొడాఫోన్

vodafone services may stopped in india

టెలికాం సంస్థ వొడాఫోన్ సరికొత్త ప్లాన్ల‌ను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం ప‌లు నూత‌న ప్లాన్ల‌ను ప్రకటించింది. రూ.24, రూ.129, రూ.199, రూ.269 రీచార్జి ప్యాక్‌లలో ఈ ప్లాన్లు ల‌భిస్తున్నాయి. రూ.24 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు 100 ఉచిత ఆన్‌-నెట్ కాల్స్ వ‌స్తాయి. కాల్ కాస్ట్ సెక‌నుకు 2.5 పైస‌లు అవుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీని 14 రోజులుగా నిర్ణ‌యించారు.

అలాగే రూ.129 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్‌, 300 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ డేటా వ‌స్తాయి. వాలిడిటీ 14 రోజులుగా ఉంది. రూ.199 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. వాలిడిటీ 21 రోజులుగా ఉంది. రూ.269 ప్లాన్‌లో రోజుకు 4జీబీ డేటా, 600 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. వాలిడిటీ 56 రోజులు ఉంటుంది.

Related posts