telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కరోనా సెకండ్‌ వేవ్‌.. ఇవే కొత్త లక్షణాలు !

కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం.. ఇవే చేప్పేవారు. కానీ ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో కరోనా సోకిన వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. మరణాల రేటు తక్కువగానే ఉన్నా.. ఈసారి కరోనా వల్ల ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ వేరియంట్ల వల్ల వైరస్‌లో జరుగుతున్న ఉత్పరివర్తనాల వల్ల ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత బాగా పెరుగుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్‌ మరింత శక్తివంతంగా మారి సోకిన వారిలో కొత్త లక్షనాలకు కారణమవుతోందని, శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తోందని చెప్పారు నిపుణులు. వైరస్‌ సోకిన వారిలో పొత్తి కడుపులో నొప్పి, వాంతులు, వికారం, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం వంటి కొత్త లక్షణాలను గుర్తించారు. జీర్ణవ్యవస్థలో భారీగా ఉండే ఏసీఈ2 గ్రాహాకాలకు అతుక్కుని వైరస్‌ తన సంఖ్యను పెంచుకుంటోందని నిపుణులు అంటున్నారు. ఈ లక్షణాలు కనిపించినవారిలో జ్వరం, దగ్గు వంటి సమస్యలు లేకపోవడానన్ని గమనించారు. కాబట్టి.. కొత్త లక్షణాలు ఉంటే కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే.

Related posts