నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో కఠినంగా ఉండాలని తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. జడ్పీ చైర్‌పర్సన్ కుమారి బిందు అధ్యక్షతన నేడు మహబూబాబాద్ జిల్లా పరిషత్ పరిషత్ తొలి సమావేశం జరిగింది సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పథకం లబ్దిదారులకు చేరేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడినది కావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం రైతులకు అందించే ప్రతి పథకం లబ్దిదారులకు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీల వల్ల ఏ రైతు నష్టపోకుండా చూడాలన్నారు. ఒకవేళ ఇప్పటికే నష్టపోయినైట్లెతే వారికి పరిహారం అందించాలన్నారు. కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
కేసీఆర్ ఉద్యమ ద్రోహులతో మాట్లాడిస్తున్నారు: అశ్వాత్థామరెడ్డి