telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాన్ ఇండియా మూవీగా పూరి, విజయ్ దేవరకొండ “ఫైటర్”

Vijay-Devarakonda

సెన్సేషనల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ “అర్జున్ రెడ్డి” సినిమాతో తెలుగుతోపాటు అన్ని భాష‌ల్లోనూ క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్”. ఈ చిత్రం ఇటీవలే నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదలైన మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. తాజాగా విజయ్, డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్‌’తో సూపర్ హిట్ అందుకున్న పూరీ ఓ సూపర్ క్రేజీ పాత్రను విజయ్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ ఆ పాత్రలో అలరించనున్నారని టాక్. సరిగా పలకలేని వ్యక్తిగా నటించనున్నాడని టాక్. ఈ విషయాన్ని ఛార్మి అధికారికంగా ప్రకటించింది. “ఫైటర్” పేరుతో ఈ సినిమా రూపొందబోతోంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా పలు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతోందని తెలుస్తోంది. పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలవుతుందని సమాచారం. “అర్జున్‌రెడ్డి” సినిమా కారణంగా బాలీవుడ్‌లో విజయ్‌కి మంచి క్రేజ్ ఏర్పడింది. అక్కడ జరిగే వేడుకలకు, పార్టీలకు విజయ్ హాజరవుతున్నాడు. అక్కడి స్టార్లతో అనుబంధం ఏర్పరుచుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఓ సినిమా చేయాలని విజయ్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. ఇప్పుడు “ఫైటర్” కోసం పూరీ ఆ తరహా కథనే సిద్ధం చేయడంతో ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే మంచిదని విజయ్ అనుకుంటున్నాడట.

Related posts