telugu navyamedia
సినిమా వార్తలు

మా ఎన్నిక‌ల పూర్తి ఫ‌లితాలు..

తీవ్ర ఉత్కంఠ న‌డుమ ‘మా’ ఎన్నికల తుది ఫలితాలు వచ్చేశాయి. ఎన్నికల అధికారి కృష్ణమోహన్​ వీటిని ప్రకటించారు. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 72 శాతం పోలింగ్ నమోదైంది. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచారు. విష్ణుకు 381 రాగా సమీప ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‎కు 274 ఓట్లు వచ్చాయి. దీంతో మంచు విష్ణు 107 ఓట్లతో విజయ ధుంధుభి మోగించారు.

ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఎనిమిది మంది, విష్ణు ప్యానల్ నుంచి 10 మంది ఈసీ మెంబర్లుగా గెలుపొందారు. అందులో శివారెడ్డికి అత్యధికంగా 362 ఓట్లు వచ్చాయి.

జనరల్ సెక్రటరీగా రఘుబాబు ఏడు ఓట్ల తేడాతో జీవితపై గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్​గా శ్రీకాంత్.. వైస్​ ప్రెసిడెంట్లుగా మాదాల రవి, బెనర్జీ.. జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్, గౌతమ్ రాజు.. కోశాధికారిగా శివబాలాజీ విజయం సాధించారు.

గెలుపొందిన ఈసీ మెంబర్లుకు పోలైన ఓట్లు

శివారెడ్డి (362 ఓట్లు)
గీతా సింగ్‌ (342 ఓట్లు)
అశోక్‌ కుమార్‌ (336 ఓట్లు)
బ్రహ్మాజీ (334 ఓట్లు)
శ్రీలక్ష్మీ (330 ఓట్లు)
సి.మాణిక్‌ (326 ఓట్లు)
ప్రభాకర్‌ (319 ఓట్లు)
తనీష్‌ (306 ఓట్లు)
శ్రీనివాసులు (296 ఓట్లు)
హరనాథ్‌బాబు (296 ఓట్లు)
సురేశ్‌ కొండేటి (294 ఓట్లు)
ఎన్‌.శివన్నారాయణ (290 ఓట్లు)
సంపూర్ణేశ్‌బాబు (285 ఓట్లు)
శశాంక్‌ (284 ఓట్లు)
సమీర్‌ (282 ఓట్లు)
సుడిగాలి సుధీర్‌ (279 ఓట్లు)
బొప్పన విష్ణు (271 ఓట్లు)
కౌశిక్‌ (269 ఓట్లు)

Related posts