కరోనా కష్ట కాలంలో చాలా దేశాలు భారత్‌కు అండగా నిలుస్తూ వస్తున్నాయి. కొందరు ఆక్సిజన్, మరికొందరు మందులు, ఇంకా కొందరు ఇతర సామాగ్రి ఇలా.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. మరికొన్ని దేశాలు భారత్ సాయాన్ని అందుకుని.. ఇప్పుడు రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.. తాజాగా, అటు క్రికెటర్లు, సినిమా స్టార్లు కూడా విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా కట్టడి కోసం.. తమిళనాడు ప్రభుత్వానికి రూ.50 లక్షల చెక్ ను తమిళనాడు సర్కార్ కు అందజేశారు. ఇందు లో బాగంగా తమిళనాడు సిఎం స్టాలిన్ ను కలిసి చెక్ ను అందజేశాడు రజినీకాంత్. ఇక ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా.. మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ రూ. 25 లక్షలు, ఫేమస్ డైరెక్టర్ శంకర్ రూ.10 లక్షలు, సౌందర్య రజినీకాంత్ భర్త విశాగణ్ కోటి రూపాయలు ఇచ్చారు.
previous post