telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’ ఎన్నికల్లో విత్‌ డ్రా చేసుకోమని చిరంజీవి సూచించారు: మంచు విష్ణు

‘మా’ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. నిన్న జరిగిన పోలింగ్‌లో మా అధ్యక్షుడు మినహా మిగతా ఈసీ మెంబర్ల తుది ఫలితాలు వెల్లడి కాలేదు. తాజాగా 18మంది ఈసీ సభ్యుల తుది ఫలితాలను వెల్లడించారు. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మంచు విష్ణు మాట్లాడారు. అయితే మా ఎన్నికల్లో విత్‌ డ్రా చేసుకోమని చిరంజీవి తనకు సూచించారని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ..’మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలు. నాపై నమ్మకం ఉంచి గెలిపించిన సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉన్న నటులు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు. గెలుపొందేందుకు మా ప్యానల్‌ అందరం కష్టపడ్డాం. కానీ మా ప్యానల్‌లో కొందరు సభ్యులు గెలవకపోవడం బాధాకరం. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో గెలిచిన వారిని కలుపుకొని పోతాం. మేమంతా ఒక్కటే.

ఎన్నికల్లో గెలుపోటములు సహజం​. నాగబాబు మా కుటుంబంలో సభ్యుడిలాగే. తొందరపడి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించను. మా అధ్యక్ష స్థానంలో ఉన్న నేను నాగబాబు రాజీనామాను ఆమోదించను. త్వరలోనే ఈ విషయం గురించి స్వయంగా ఆయనతోనే వెళ్లి మాట్లాడతా. అలాగే ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామాను కూడా ఆమోదించను’ అని పేర్కొన్నారు.

Related posts