telugu navyamedia
సినిమా వార్తలు

వరంగల్‌లో కాజల్‌ సందడి.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి వరంగల్‌లో దర్శనమిచ్చింది. దీంతో ఆమె అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అక్కడ తన అభిమానులతో మాట్లాడిన కాజల్ .. “నన్ను కలవడానికి ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను వరంగల్ వచ్చిన ప్రతిసారి మీ అందరి నుండి నాకు ఘనస్వాగతం లభిస్తుంది. మీరు నా సినిమాలను ఇష్టపడటం నాకు సంతోషంగా ఉంది. నేను ఈ నగరాన్ని ఎప్పుడూ ఇష్టపడతాను.. అంటూ తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడింది.

ఈ ఫొటోల్లో కాజల్‌ బంగారు రంగు చీరలో మెరిసిపోతుంది. కాజల్‌ ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉంది. ఆచార్య సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంకా..నాగార్జున అక్కినేని చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో తన పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని కాజల్ తెలిపారు. ఇటీవల కోల్‌కతాలో సుదీర్ఘ షెడ్యూల్ లో, ఉమ చిత్రీకరణలోనూ కాజల్ పాల్గొన్నారు. కాజల్ నటిస్తున్న మరో మూడు చిత్రాలు మిడిల్ లో ఉన్నాయి.

Related posts