telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రదీప్ ఖాతాలో అరుదైన రికార్డు… 100 మిలియన్ వ్యూస్

30

యాంక‌ర్ ప్ర‌దీప్ హీరోగా న‌టించిన ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా’ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం.. ’ పాట సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం వ‌హించిన ఈ పాట‌ను చంద్ర‌బోస్ రాశారు. ఈ పాట 100 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. అన్నీ వ్యూస్‌ను రాబ‌ట్టుకోవ‌డం గొప్ప విష‌య‌మే. బ‌న్నీ త‌ర్వాత 100 మిలియ‌న్ వ్యూస్ సాధించిన సాంగ్ ఉన్న సినిమాను త‌న ఖాతాలో వేసుకోవ‌డం ప్ర‌దీప్‌కే సొంత‌మ‌య్యింది. ఉగాది సంద‌ర్భంగా ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా’ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా సినిమా విడుద‌ల ఆగింది. మ‌రి కోవిడ్ 19 ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత సినిమా విడుద‌ల‌ను ఖ‌రారు చేస్తారు. ఈ మ‌ధ్య సినీ ప్రేక్ష‌కుల‌ను తెగ మెప్పించిన పాట‌ల్లో బ‌న్నీ హీరోగా న‌టించిన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సాంగ్స్ ముందు వ‌రుస‌లో నిలిచాయి.

Related posts