సంక్రాంతికి స్టార్ హీరోల మధ్యన మొదలైన వార్ ఇప్పటికీ కొనసాగుతోంది. మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ చిత్రాలతో సంక్రాంతి బరిలోకి దిగారు. రెండు చిత్రాలు కూడా హిట్ టాక్ సొంతం చేసుకుని..భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్లాయి. రిలీజ్ డేట్స్ నుంచి స్టార్టయిన ఈ వార్… తాజాగా 50 డేస్ కలెక్షన్స్ వరకు సాగింది. మా మూవీ ఎక్కువ కలెక్షన్లు సాధించింది అంటే..మాది సాధించింది అని రెండు చిత్రాలు యూనిట్లు పోస్టర్స్ రిలీజ్ చేశాయి. నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకున్నామంటూ నిర్మాతలు ఘనంగా చాటింపు వేసుకున్నారు. రెండు మూవీస్ ఇప్పుడు 50 రోజుల రన్‌ని పూర్తి చేసుకుని..డిజిటల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లోకి అడుగుపెట్టాయి. ‘ఇండస్ట్రీ హిట్ (నాన్-బిబి)’ పోస్టర్‌తో ‘అల వైకుంఠపురంలో’ పోస్టర్ రిలీజ్ చెయ్యగా, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ (తెలుగు రాష్ట్రాల్లో నాన్-బిబి) అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ కూడా అదే తరహా పోస్టర్ రిలీజ్ చెయ్యడం గమనార్హం.
previous post