telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేనికైనా ఆధారే ఆధారం.. దిద్దుబాట్లకు .. పాస్ పోర్ట్ తరహా .. ఆన్ లైన్ బుకింగ్ ..

aadhar

భారతదేశంలో దేనికైనా ఆధారంగా పనిచేస్తుంది ఒక్క ఆధార్ గుర్తింపు మాత్రమే. అందువలన దాని ప్రాముఖ్యత ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ ఈ గుర్తింపు కార్డులో ఏదైనా తప్పుఉంటె ఇప్పటివరకు అనేక తిప్పలు పడిఉంటారు. ఇక మీదట వాటికీ చెక్ పెట్టేసింది ప్రభుత్వం. ఇప్పుడు అలాంటి టెన్షన్స్‌కి చెక్ పెడుతూ.. యూఐడీఏఐ అంటే.. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ తాజాగా ఆన్‌లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే.. ఏడు పట్టణాల్లో ఆధార్ సంస్థలను తీసుకొచ్చాయి. అవి.. పాస్‌పోర్ట్ ఆఫీల మాదిరిగా ఉంటాయి. అక్కడ మనకు సంబంధించిన అన్ని ఫ్రూఫులతో.. మా పేర్లు.. అడ్రస్‌లను మార్చుకోవచ్చు.

ఢిల్లీ, బోపాల్, ఆగ్రా, చెన్నై, చంఢీగఢ్, హిసర్, విజయవాడ వంటి పలు ప్రాంతాల్లో యూఐడీఏఐ కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. ఇక నుంచి లైన్లలో అక్కడ ఇక్కడా.. నుంచునే శ్రమ తగ్గింది. డైరెక్ట్ ఆధార్ కార్డ్ ఆఫీస్‌కు వెళ్లి పని చేసుకోవచ్చు. కాగా.. ఈ ఆధార్ సంస్థలు వారంలో ఏడు రోజులు పనిచేస్తాయి. మంగళవారం సెలవు.

Related posts