శశికళ జైలు నుంచి విడుదలైంది. అయితే, కరోనా కారణంగా ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. చికిత్స నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యాక ఫిబ్రవరి 3 వ తేదీన చెన్నైకి రాబోతున్నారు. ఇక చెన్నైలో ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు 66 చోట్ల స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. చిన్నమ్మ నేరుగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుదరదు. అయితే, బెయిల్ పై విడుదలయ్యాక శశికళ వ్యూహం ఏంటి అన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నది. జయలలిత లేకపోవడంతో అన్నాడీఎంకే పార్టీని కైవసం చేసుకునేందుకు శశికళ ప్రయత్నం చేస్తుందా? దానికి ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు సహకరిస్తారా అన్నది తేలాలి. సహకరించకుంటే, అన్నాడీఎంకేలోని తన అనుకూల వర్గంతో కలిసి పార్టీలో తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నది. అప్పుడు అన్నాడీఎంకే పార్టీ చీలిపోయే అవకాశం ఉంటుంది. పార్టీలో చీలిక వస్తే, దాని వలన ఎవరికీ ఉపయోగం ఉండదు. కానీ, డీఎంకే పార్టీ బలపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్నాడీఎంకే పార్టీని స్వచ్చందంగా శశికళకు అప్పగిస్తే విమర్శలు వచ్చే అవకాశం లేకపోలేదు.
previous post
ఇక చంద్రబాబు కుంభకోణాలన్ని వెలుగులోకి వస్తాయి: విజయసాయి